చిన్న వివాదం ఓ వ్యక్తిని మృగంలా మార్చేసింది. అతడు ఏకంగా మేనమామ చెవినే కొరికి నమిలేశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, వైశాలి జిల్లాకు చెందిన మనేశ్వర్ ఠాకూర్ అనే వ్యక్తి కుటుంబానికి.. అతడి ఇంటి పక్కనే ఉండే చెల్లెలి కుటుంబానికి చాలా రోజుల నుంచి చిన్న చిన్న విషయాల్లో గొడవలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ రోజు మనేశ్వర్ తడిగా ఉన్న వంట చెరుకును పొడిగా ఉన్న అల్లుడి వంట చెరుకుపై ఉంచాడు. దీంతో గొడవ మొదలైంది. మేనల్లుడు.. మామపై ఫైర్ అయ్యాడు. బాగా తిట్టాడు. అంతటితో అతడి ఆగ్రహం చల్లారలేదు. మామపైకి దూసుకెళ్లాడు. మనేశ్వర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి కిందపడేశాడు.
అనంతరం అతడి చెవిని తన పళ్లతో గట్టిగా కొరికాడు. తర్వాత చెవి ముక్కను నమిలి ఊసేశాడు. స్థానికులు కల్పించుకుని గొడవను ఆపేశారు. ఆ వెంటనే తీవ్రంగా గాయపడ్డ మనేశ్వర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, చెవి భాగం చాలా వరకు తెగిపోయింది. దానికి తోడు రక్తం కూడా బాగా కారుతోంది. దీంతో అక్కడి వైద్యులు చికిత్స అందించటానికి నిరాకరించారు. అతడ్ని పాట్నాకు వెళ్లమని సూచించారు. అక్కడయితే ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. బాధితుడి కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం మనేశ్వర్‌కు పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.