భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ కొందరు వ్యక్తులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఆ వివాహ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి ఏకంగా వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు పరాయి సుఖం కోసం పాకులాడి క్షణిక సుఖానికి అడ్డొచ్చిన మనుషులను సైతం హత్య చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ పెళ్లైన ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరివారి పాళెం. ఇదే గ్రామంలో పెంచాలయ్య, శ్రావణి భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగా కాపురాన్ని సాగించారు. అయితే భర్త స్నేహితుడైన అజయ్ అనే వ్యక్తి అప్పుడప్పుడు శ్రావణి ఇంటికి వస్తుండేవాడు. ఇతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అజయ్ అలా ప్రతిసారి శ్రావణి ఇంటికి వస్తుండడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో భర్తలేని సమయం చూసి శ్రావణి ప్రియుడి అజయ్ తో తెగ ఎంజాయ్ చేసేది. అయితే ఇటీవల శ్రావణి భర్త పెంచాలయ్య బయటకు వెళ్లాడు. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడు విజయ్ శ్రావణి ఇంట్లో అడుగు పెట్టి ఆమె వళ్లో వాలిపోయాడు. వీరిద్దరూ ఇంట్లో బెడ్ పై ఉండగా శ్రావణి భర్త పెంచాలయ్య చూశాడు. దీనిని చూసి సహించలేని పెంచాలయ్య… నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ అజయ్ పై దాడి చేయబోయాడు. వెంటనే విజయ్ పెంచాలయ్యను గట్టిగా పట్టుకుని అతని గుండెపై పిడుగుద్దులు గుద్దాడు. అప్పటికే పెంచాలయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
అనంతరం చున్నీతో పెంచాలయ్య మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ప్రియుడు భర్తను హత్య చేసే సమయంలో శ్రావణి అస్సలు కూడా అడ్డుపడలేదు. ఇక ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానమొచ్చి భార్యను విచారించారు. మొదట్లో ఏం తెలియదన్నట్లుగా నాటకమాడిన శ్రావణి.., పోలీసులు తమదైన స్టైల్ లో విచారించేసరికి అసలు విషయం బయట పెట్టింది.
నా భర్త స్నేహితుడితో కాస్త సన్నిహితంగా మెలిగానని, గత నెల 31న భర్త బయటకు వెళ్లడంతో ప్రియుడు విజయ్ ఇంట్లో వచ్చాడు. మేమిద్దరం కలిసి ఉండడం చూసి తట్టుకోలేక దాడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ అజయ్ భయంతో నా భర్తను హత్య చేశాడంటూ పోలీసులకు వివరించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణితో పాటు ఆమె ప్రియుడు అజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివాహ వ్యవస్థకు చెరిగిపోని మచ్చను తెస్తూ పడక సుఖం ఇంతటి దారుణానికి పాల్పడ్డ శ్రావణి, అజయ్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.