నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మత్తులో విర్రవీగిన ఓ వ్యక్తి భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు. ఈ దాడిలో కూతురు మరణించింది. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. అది నెల్లూరు జిల్లా కందుకూరు మండలం మాచవరంరెడ్డి పాలెం. ఇదే గ్రామానికి చెందిన కుందూరి శ్రీనివాసరెడ్డి భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది.
శ్రీనివాసరెడ్డి మద్యానికి అలవాటు పడి రోజూ భార్యను వేధింపులకు గురిచేసేవాడు. తాగుడే పనిగా పెట్టుకుని శ్రీనివాసరెడ్డి తరుచు మద్యం మత్తులోనే ఉండేవాడు. అయితే భార్య కష్టపడి కూడబెట్టిన సోమ్మును సైతం తన మద్యానికి ఇవ్వాలంటూ పట్టుపట్టేవాడు. కాదంటే భార్యపై దాడికి కూడా పాల్పడేవాడు. ఆగస్టు14న భర్త శ్రీనివాసరెడ్డి భార్య, కూతురితో గొడవ పెట్టుకున్నాడు. ఇక కోపంతో ఊగిపోయిన ఈ దుర్మార్గుడు భార్య, కూతురు జోరుగా నిద్రలోకి జారుకున్నాక వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా వారు అరుపులు వేయడంతో స్థానికులు వచ్చేలోపే సగం కాలిపోయారు.
వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన కూతురు ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం భార్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులోహాజరు పరిచారు. దీనిపై న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ తాజాగా నిందితుడు శ్రీనివాసరెడ్డికి జీవితఖైదు శిక్ష విధించడంతో పాటు రూ.8 వేల జరిమానా విధించింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మద్యం మత్తులో కూతురి మరణానికి కారణమైన తండ్రి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.