న్యూఇయర్ వేడుకలు ఒకరిని పొట్టనపెట్టుకున్నాయి. పాత ఏడాది గడిచిపోతూ.. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామనే సంతోషంలో పార్టీ చేసుకున్న కొంతమంది యువకులు దారుణానికి ఒడిగట్టారు. తమ గ్రూప్‌లోని ఒక స్నేహితుడినే దారుణంగా గొంతుకోసి, గుండెల్లో కత్తి పొడిచి పొడిచి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నాయడుపేటలో కొంతమంది యువకులు న్యూ ఇయర్ వేడుకలను చేసుకున్నారు. మద్యం మత్తులో అదే బ్యాచ్‌లోని ఒక యువకుడి గొంతుకోసి చంపేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనలో భాగమైన యువకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసలు వారిని గాలించే పనిలో ఉన్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. న్యూ ఇయర్ వేడుకల్లో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో.. ఆ యువకుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను పట్టుకుని.. కఠిన శిక్ష విధించాలని స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు.