ప్రజలకు బాసటగా నిలవాల్సిన కొందరు పోలీసులు ఖాకి కావరంతో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దారి తప్పి అడుగులేస్తూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఎస్సై మహిళా కానిస్టేబుల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా పెళ్లైన ఆరు నెలలకే అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. భర్త తీరుతో విసుగు చెందిన భార్య భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వేదాయపాళెంలో షేక్ మహబూబ్ షుభాని అనే వ్యక్తి ఎస్సైగా పని చేస్తున్నారు. అయితే గతంలో ఈ అయ్యగారు సంతపేటలో విధులు నిర్వర్తించారు. అక్కడ పని చేస్తున్న క్రమంలోనే ఓ మహిళా కానిస్టేబుల్ ను ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడ్డాడు. అలా వెంటపడ్డ కొంత కాలానికి ఆ మహిళా కానిస్టేబుల్ సైతం కనికరించి ఇతనితో ప్రేమ గీతాన్ని ఆలపించింది. అలా కొన్నాళ్లకి ఇద్దరు కలిసి ప్రేమ విహారంలో తేలియాడారు. అయితే ఈ క్రమంలోనే షేక్ మహబూబ్ ఆ మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకుంటానని ఒప్పించాడు.
ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో ఆ మహిళ మొదట్లో అతనితో పెళ్లికి నిరాకరించింది. ఇక మొత్తానికి ఎస్సై షేక్ మహబూబ్ తన ప్రియురాలిని ఒప్పించి ఎట్టకేలకు పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక పెళ్లి అనంతరం ఇద్దరు కలిసి ఓ చోట కాపురం పెట్టారు. అలా పెళ్లైన ఆరు నెలల పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. ఇక రోజులు మారుతున్న కొద్ది మన ఎస్సై షేక్ మహబూబ్ దారి తప్పి వక్రమార్గం వైపు పయనించాడు. దీంతో భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. ఇక భర్త తీరుతో విసుగు చెందిన ఆ మహిళా కానిస్టేబుల్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఓ ఉన్నతమైన హోదాలో పని చేస్తూ ఇవేం ఖాకి లెక్కలు అంటూ స్థానికులు ఇతని తీరుపై మండిపడుతున్నారు.