గత కొన్ని రోజలు నుంచి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తీసుకున్న లోన్ సమయానికి చెల్లించని కారణంగా నిర్వహకులు లోన్ చెల్లించాలని వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని తట్టుకోలేక కొంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం చెల్లించాలంటూ అధికారులు వేధించారు. తర్వాత ఏ జరిగిందో తెలియదు కానీ ఈ క్రమంలోనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా తాళ్లపూడి మండలం పెద్దవాని గ్రామంలో కొండమంచిలి శివకుమార్ నివాసం ఉంటున్నాడు. గతంలో ఇతనికి తులసి అనే యువతితో వివాహం జరిగింది. గతంలో ఫైనాన్స్ కంపెనీలో పని చేసిన శివకుమార్ కొంత కాలం స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. కాగా శివ కుమార్ కొన్ని రోజుల కిందట క్రిడిట్ కార్డ్ ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే ఈ నెల 19న బ్యాంక్ అధికారులు తీసుకున్న రుణం వెంటనే చెల్లించాలని అడిగారు.
ఇది కూడా చదవండి: తాగిన మత్తులో అత్తపై అల్లుడి దారుణం.. ఇంట్లో అందరూ చూస్తుండగా!
ఏం జరిగిందో ఏం కానీ అదే రోజు రాత్రి బైక్ పై రోడ్ కం రైలు వంతెన వద్దకు వచ్చి తన తండ్రికి ఫోన్ చేశాడు. నాన్న.. నేను గోదావరిలో దూకి చనిపోతున్నా అంటూ ఏడుస్తూ చెప్పి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన తండ్రి పోలీసులకు సమాచారాన్ని అందించగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో శివ కుమార్ ఫోన్, చెప్పులను పోలీసులు గుర్తించారు. ఇక భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.