ఈ రోజుల్లో కొందరు కోపంలో ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. క్షణికావేశంలో కన్నవాళ్లను, తల్లిదండ్రులను ఇలా ఎవరినీ వదలకుండా దారుణంగా హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కుమారుడు.. ఏకంగా కన్న తండ్రిని లారీతో తొక్కించి హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటన వెనుక ఏం జరిగింది? కొడుకు తండ్రిని అంత దారుణంగా హత్య చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కడప జిల్లా ముద్దునూరు మండలం కొర్రపాడులో కొడుకు షఫీ, తండ్రి మహ్మద్ భాష నివాసం ఉంటున్నారు. తండ్రీకొడుకుల ఇద్దరూ లారీ డ్రైవర్లు కావడం విశేషం. అయితే తండ్రీకొడుకులు ఇద్దరు బుధవారం తాడిపత్రి నుంచి సిమెంట్ లోడుతో నెల్లూరుకు బయలుదేరారు. ఇక వీరితో పాటు మరో వ్యక్తి కూడా వెళ్లాడు. ఇక లారీ ఎక్కినప్పటి నుంచి తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. వీరి గొడవను భరించలేకపోయిన వీరి వెంట వచ్చిన వ్యక్తి రాజయ్యపాలెం వద్ద లారీ దిగి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలోనే తండ్రీకొడుకుల మధ్య గొడవ మరింత తీవ్రరూపం దాల్చింది. వెంటనే తండ్రి భాష లారీ దిగి లారీకి అడ్డంగా నిలబడ్డాడు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన కుమారుడు షఫీ తండ్రిని అదే లారీతో తొక్కించాడు. ఈ దాడిలో తండ్రి భాష రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక తండ్రి చనిపోయాడని తెలుసుకున్న కుమారుడు.. లారీతో పాటు పరారయ్యాడు.
భాష మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.