ఆదివారం నుంచి కనిపించకుండాపోయిన చిన్నారి హారిక కేసు విషాదాంతం అయింది. ఊయల నుంచి మిస్సింగ్ అయిన ఈ చిన్నారి చివరికి ఓ కాలువలో శవమై తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండాపోయిన చిన్నారి హారిక కేసు విషాదాంతం అయింది. ఊయల నుంచి మిస్సింగ్ అయిన ఈ చిన్నారి చివరికి ఓ కాలువలో శవమై తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న హారిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. అసలేం జరిగిందంటే?
అసలేం జరిగిందంటే?:
పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని గుర్రాలమడుగు సంఘం. ఇదే గ్రామంలో మణికంఠ-అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగు ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే భర్త మణికంఠ స్థానికంగా ఓ హోటల్ ను నడిపిస్తూ అక్కడే ఉంటుండగా, భార్య పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. భర్త మాత్రం అప్పడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇకపోతే ఆదివారం రోజు అనూష పిల్లలకు తినిపించి ఊయలలో తన కూతురు హారికను పడుకోబెట్టి తానూ నిద్రపోయింది. అర్థరాత్రి ఇంట్లో కరెంట్ పోయింది. దీంతో ఉక్కపోతకు ఉండడంతో అనూష ఇంటి తలుపులు తెరిచి మళ్లీ పడుకుంది.
ఇదే మంచి సమయం అనుకున్న కొందరు దుండగులు.. ఊయలలో ఉన్న ఆ చిన్నారిని ఎత్తుకుని అదే ఊయలలో రెండు బొమ్మలు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక తెల్లవారుజామున అనుష నిద్రలేచి చూడగా..ఊయలలో ఉండాల్సిన కూతురు హారిక కనిపించలేదు. దీంతో షాక్ గురైన ఆ మహిళ.. వెంటనే భర్తకు, అత్తింటి కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే అందరూ చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆ చిన్నారి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక అనుష స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చిన్నారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న సర్వేపల్లి కాలువలో చిన్నారి హారిక శవమై తేలింది. దీనిని గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న హారిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ కాలువ వద్దకు చేరుకుని హారికను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఇది పక్కా రక్త సంబంధికులు చేసిన పనేనంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఊయలలో మిస్ అయి.. చివరికి కాలువలో శవమై తేలిన చిన్నారి హారిక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.