ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు హరిహరకృష్ణ. అంతటితో ఆగక.. నవీన్ మృతదేహం మీద తన పగను తీర్చుకున్నాడు. అతడి శరీరంలోని భాగాలను వేరు చేసి.. మృతదేహాన్ని గుర్తు పట్టరాని విధంగా మార్చాడు. ఆఖరికి నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా ఆ డెడ్‌బాడీ అతడిదే అని గుర్తు పట్టారు. మరి ఇంతకు నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఎవరిది అంటే..
అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు హరిహరకృష్ణతో పాటు అతడి గర్ల్ ఫ్రెండ్, స్నేహితుడు హసన్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం యువతిని చంచల్‌గూడ జైలుకు తరలించగా, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక నవీన్‌ను నమ్మించి అత్యంత దారుణంగా హత్య చేసిన హరి.. అతడి శరీరభాగాలను వేరు చేసి.. వాటిని కాల్చేశాడు. దాంతో మృతదేహం గుర్తు పట్టరాని విధంగా మారింది. కాకపోతే నవీన్ చేతి మీద ఉన్న టాటూ ఆధారంగా.. ఆ మృతదేహం అతడిదే అన్న సమాచారం తెలిసింది. మరి ఇంతకు నవీన్ చేతి మీద ఉన్న ఆ పచ్చబొట్టు ఎవరిది అంటే..
నవీన్‌ని దారుణంగా హత్య చేసిన హరి.. అతడి శరీరం నుంచి గుండెను వేరు చేశాడు. వేళ్లను కట్ చేశాడు. తన మనసులో ఉన్న కసినంతా నవీన్ మృతదేహం మీద చూపాడు. ఆ తర్వాత శరీర భాగాలను తగలబెట్టాడు. ఇక నవీన్ మృతదేహం గుర్తు పట్టలేనంత దారుణంగా తయారయ్యింది. ఈ క్రమంలో నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు కారణంగా ఆ మృతదేహం అతడిదే అని అర్థం అయ్యింది. నవీన్‌కు తల్లి అంటే ఏంతో ప్రేమ. అయితే దురదృష్టవశాత్తు.. నవీన్ తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో నవీన్ తల్లి దగ్గరే ఉండేవాడు. ఈ క్రమంలో తల్లి మీద తన ప్రేమకు గుర్తుగా చేతి మీద అమ్మ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. దాన్ని చూసి.. ఆ మృతదేహం నవీన్‌దే అని గురించారు.
నవీన్‌ను అంత దారుణ స్థితిలో చేసిన అతడి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. బిడ్డా నిన్ను ఇలా చూస్తామనుకోలేదు కదరా.. ఎంత సక్కగుండెటోడివి.. ఇలా పార్ట్‌లు.. పార్ట్‌లుగా అయ్యావ్.. నీకు ఎంత కష్టం వచ్చిందిరా అంటూ ఏడుస్తున్నారు. నవీన్ తన తల్లిని ఎంత ప్రేమించాడో.. ఆ యువతిని కూడా అదే విధంగా ప్రేమించాడు. కానీ ఆమె మాత్రం అతడి ప్రాణాలు తీసింది. ఇంతలా ప్రేమించిన వ్యక్తిని చివరకు అత్యంత దారుణంగా అతడి తల్లిదండ్రులు గుర్తు పట్టలేని విధంగా హత్య చేయించింది. తల్లితో సమానంగా ప్రేమించే వ్యక్తిని ఇంత దారుణంగా చంపించడానికి నీకు మనసు ఎలా వచ్చింది.. దీని వల్ల నువ్వు ఏం బాగుపడ్డావ్.. జైలు పాలయ్యి.. నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నావ్ కదా అంటున్నారు నవీన్ మిత్రులు. అమ్మను ఎలా ప్రేమించాడో.. ఆ యువతిపై కూడా అంతే ప్రేమను పెంచుకున్నాడు నవీన్. కానీ యువతి మాత్రం ఇంతటి దారుణానికి కారకురాలయ్యింది. మరి యువతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.