నవీన్ హత్య చేయాలన్న ఆలోచన కొన్ని నెలల ముందునుంచే ఉంది. ఇందుకోసం ఓ కత్తి కూడా రెడీ చేసిపెట్టుకున్నాడు. హత్య కోసం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాడు. క్రైం షోలు ఎక్కువగా చూస్తూ వచ్చాడు.
నవీన్, ప్రీతి, రక్షిత ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేర్లివి. వీరిలో ఆ ఇద్దరమ్మాయిలు ఆత్మహత్య చేసుకోగా.. నవీన్ హత్య గావించబడ్డాడు. లవ్ ట్రాయింగిల్ కారణంగా నవీన్‌ను అతడి స్నేహితుడు హరి అతికిరాతకంగా హత్య చేశాడు. నవీన్ శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేశాడు. గుండె బయటకు తీసి పడేశాడు. ఇక, డాక్టర్ ప్రీతి ఘటనలో సీనియర్ వేధింపులు ఆమె పాలిట శాపంగా మారాయి. సీనియర్ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. రక్షిత ఘటన కూడా అచ్చం ఇలాంటిదే.
ప్రేమ వేధింపుల కారణంగా రక్షిత చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ మూడు ఘటనలు యువతకు సంబంధించినవి కావటం.. మూడు ఘటనల్లోనూ బాధితులు, నిందితులు అందరూ యువతే కావటం గమనార్హం. గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో యువతలో నేర ప్రవృత్తి ఎక్కువయిపోయింది. అంతేకాదు! ప్రతీ చిన్న సమస్యకు యువత ఆత్మహత్యను పరిష్కారంగా భావిస్తోంది. వీటన్నిటిలోనూ యువతీ, యువకుల మధ్య సంబంధాలు కామన్ పాయింట్‌గా ఉన్నాయి. ఈ దారుణాలకు ప్రేమ వ్యవహారాలు, గొడవలు ప్రధాన కారణం అవుతున్నాయి.
అయితే, వారు ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా? ఎందుకు నేటి యువత సున్నితత్వాన్ని కోల్పోతోంది? సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించకుండా.. సమస్యను నాశనం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? తల్లిదండ్రుల పెంపకం లోపమా? సమాజం ప్రభావం ఏదైనా ఉందా? నేటి యువత నేర ప్రవృత్తిని, సమస్యల్ని ఎదురించలేని బలహీనమైన మనసుని కలిగి ఉండటానికి కారణం ఏంటి? సైన్స్ వీటి గురించి ఏం చెబుతోంది?..
మనుషులు సంఘ జీవులు. ఓ బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రుల పెంపకంలో నేర్చుకునే దానికంటే సమాజంలోకి వెళ్లి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల పెంపకంలోని మంచి, చెడులు పిల్లలకు బేసిక్స్‌గా మాత్రమే ఉపయోగపడతాయి. వాటి పునాదుల మీదే పిల్లల భవిష్యత్తు నడుస్తుంది. అయితే, ఇవి కచ్చితంగా వారు తమ పరిగణలోకి తీసుకుంటారన్న రూలేమీ లేదు. అప్పటి పరిస్థితులను బట్టి, సావాసాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత చదువులు చదువుకున్న వారైనా.. చదువు రాని మొద్దులైనా వారి నిర్ణయ సామర్థ్యం వారు స్నేహం చేసేవారి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మంచి వ్యక్తులతో సావాసం చేసినపుడు మంచి లక్షణాలు.. చెడు వ్యక్తులతో సావాసం చేసినపుడు చెడు సావాసాలలోకి వెళ్లిపోతారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కంపాటబిలిటీ మీదే స్నేహాలు నిలుస్తాయి. మందు అలవాటు ఉన్న ఓ వ్యక్తి మందు అలవాటు ఉన్న మరో వ్యక్తితోనే ఫ్రీగా ఉండగలుగుతాడు.
తమలాంటి అలవాట్లు ఉన్న వ్యక్తులతో స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తల్లిదండ్రులతో అతడి బాండింగ్ ఎలా ఉంది? తల్లిదండ్రులు అతడితో ఎలా ప్రవర్తిస్తున్నారు? తల్లిదండ్రులు ఒకరితో ఒకరు సరిగా ఉంటున్నారా? ఎప్పుడూ గొడవలు పడుతున్నారా? అన్న విషయాలు కూడా పిల్లలపై ఎఫెక్ట్ చూపుతాయి. నవీన్‌ను హత్య చేసిన హరి విషయంలో..అతడి అన్న ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడు 9 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడట. దీనిబట్టి హరి కుటుంబంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నట్లే. అది హరి మీద ప్రభావం చూపి ఉండొచ్చు. హత్య చేసినా దొరకమన్న ధైర్యం.. దొరికినా బయటకు రావచ్చన్న ధీమా ఉండటం కనిపిస్తుంది.
నేరాలకు పాల్పడే వారిలో యాంటీ సోషల్ బిహేవియర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తిని బాధించటం వల్ల సంతోషాన్ని పొందగలిగితే అది కచ్చితంగా సమాజానికి ఇబ్బంది కలిగించే విషయమే.. నేరాలకు పాల్పడటం దీని ముఖ్య లక్షణం. ఎదుటి వ్యక్తిపై దాడి చేయటం, దొంగతనం, తిట్టడం, అబద్దాలు ఆడటం వంటి చేస్తూ ఉంటారు. ఇందులో ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా యాంటీ సోషల్ బిహేవియర్ ఉన్న వ్యక్తులు తమ పంధాను మార్చుకోరు. తాము కోరుకున్నది జరగాలన్న మొండి పట్టుదల ఉంటుంది. ప్రీతి, రక్షిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితులది ఒకరకంగా ఇలాంటి ప్రవర్తనే. ప్రీతి విషయంలో ఒకలాంటి అనుభవం ఎదురైతే.. రక్షితది మరోలాంటి అనుభవం. ప్రీతి తన సీనియర్ కారణంగా వేధింపులకు గురైంది. ఇద్దరి మధ్యా ఏవో విషయాల వల్ల భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ అభిప్రాయ భేదాల వల్ల సీనియర్ ఆమెపై పగ పెంచుకున్నాడు.
ప్రతీ విషయంలో ఆమెను వేధించటం మొదలుపెట్టారు. ఇందుకు అతడి క్లాస్‌మేట్స్ కూడా సపోర్టునిచ్చారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు మరింత దారుణంగా వ్యవహరించాడు. అవతలి వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలుగుతోంది. ఇలా చేయటం అవసరమా? అన్నది ఆలోచించకుండా వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టాడు. వేధింపులు తాళలేక ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ఇక, రక్షిత విషయానికి వస్తే.. ప్రేమించిన వ్యక్తి ఈమె విషయంలో శత్రువుగా మారాడు. రక్షితకు భూపాలపల్లకి చెందిన రాహుల్‌తో పదో తరగతి చదువుకునే రోజుల్లోనే పరియం ఏర్పడింది. ఇక గత కొంతకాలంగా రాహుల్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గతంలో రక్షిత తనతో సరదాగా దిగిన ఫోటోలను మరో యువకుడికి పంపాడు రాహుల్. వీరిద్దరు కూలిసి రక్షితను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. అంతేకాక ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో రక్షిత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకుని మరణించింది.
ఆత్మహత్య చేసుకోవాలన్న భావన ఎప్పుడైనా కలగవచ్చు.. ఏ వయసులోనైనా కలగవచ్చు. దానికి ఆడ, మగ అన్న తేడా ఉండదు. ఓ సమస్య విషయంలో తీవ్ర ఒత్తిడికి గురైనపుడు.. ఆ సమస్య ద్వారా తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నపుడు.. ఆ సమస్యకు అసలు పరిష్కారం లేదు.. ఆ సమస్య నుంచి తప్పించుకోలేను అని వ్యక్తి అనుకున్నపుడు చావు పరిష్కారంగా తోస్తుంది. ఇలా అనిపించడానికి మానసికంగా, శారీరకంగా చాలా కారణాలు ఉంటాయి.
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో కనిపించే లక్షణాలు..
కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న భావన ఎదుటి వ్యక్తి హత్యచేసేందుకు దారి తీయోచ్చు. దీన్నే హోమిసైడ్ సూసైడ్ లేదా మర్డర్ సూసైడ్ అంటారు. ఇవి ఎక్కువగా భాగస్వామితో గొడవలు పడ్డవారు. కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్న వారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు. మద్యం, డ్రగ్స్ తీసుకునేవారు. మారణాయుధాలు వెంట పెట్టుకుని తిరిగేవారు చేస్తూ ఉంటారు. మరి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.