నార్సింగిలో మరో ఇంటర్ విద్యార్థి గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక కుమారుడి మరణవార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో గతంలో సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా నార్సింగిలో మరో ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అతని తల్లిదండ్రులు, కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని మంచిరేవుల గ్రామంలో సాయి తేజ అనే బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఎంపీసీ చదువుతున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, శుక్రవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న సాయితేజ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ సాయతేజ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది. అసలు ఆ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.