నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చూపుల పేరుతో ఇంటికొచ్చిన కొందరు వ్యక్తులు యువతిని ఘోరంగా అవమానించారు. ఈ అవమానాన్ని భరించలేని ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపాలెం గ్రామంలో రోజా (25) అనే యువతి గ్రామ సచివాలయ సర్వేయర్ గా పని చేస్తున్నారు.
ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకున్న రోజాకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఈ క్రమంలోనే ఇటీవల రోజాకు పెళ్లి చూపులు అంటూ కొందరు ఇంటికి వచ్చారు. అలా వచ్చిన వ్యక్తులు అమ్మాయి పొట్టిగా, నల్లగా ఉందంటూ రోజా ముందే అవమానించేలా మాట్లాడారు. దీంతో రోజా తీవ్ర మనస్థాపానికి గురైంది. కనీస మర్యాద లేకుండా మాట్లాడడంతో రోజా తట్టుకోలేకపోయింది. దీంతో ఇటీవల రోజా ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి తన చేతల నిండా గాజులు తొడిగి అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి ఇంటికి వచ్చి చూడగా కూతురు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది.
ఈ సీన్ ను చూసిన తండ్రి ఒక్కసారిగా షాక్ కు గురై కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రోజా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై రోజా తండ్రి.. పెళ్లి చూపులు అంటూ ఇంటికొచ్చిన కొందరు వ్యక్తులు పొట్టిగా, నల్లగా ఉందని నా కూతురిని అవమానించారని, దీంతో మనస్థాపానికి గురైన నా కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.