ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన వ్యక్తులు, వివాహేతర సంబంధాలు, వరకట్నం వేధింపులు అంటూ భార్యలను వేధిస్తున్నారు. ఇదే కాకుండా ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. అక్రమం సంబంధాల పేరుతో పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ దుర్మార్గమైన భర్త నమ్మించి ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని అమాయక మహిళలను మోసం చేశాడు. ఇంతటితో ఆగకుండా రెండో భార్యను., నువ్వు ఆత్మహత్య చేసుకుంటే బీమా వస్తుందంటూ భార్యను టార్చర్ పెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. అసలు విషయం ఏంటంటే?
అది నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామం. ఇక్కడే మహేంద్రబాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ కేటుగాడు పెళ్లిళ్ల పేరుతో ఎంతో మహిళలను మోసం చేశాడు. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి ఒక అమ్మాయిని, తన సొంత గ్రామానికి చెందిన మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇకపోతే మహేంద్రబాబు ఇప్పటికే పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచి.., నాలుగేళ్ల కిందట మార్కాపురానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు భార్యతో పాటు భర్త సంతోషంగా ఉన్నట్లు నటించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. గత కొన్ని నెలల కిందట మహేంద్రబాబు.. రెండో భార్య వద్దకు వెళ్లి.., నువ్వు ఆత్మహత్య చేసుకుంటే బీమా వస్తుంది.. ఆత్మహత్య చేసుకో అంటూ భర్త టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు.
భర్త టార్చర్ ను భరించలేని ఆ మహిళ భర్త నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ లో తల దాచుకుంది. అలా కొన్నాళ్ల తర్వాత వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళను పెళ్లికాలేదని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలా కొంత కాలానికి వారిని నమ్మించి మూడో భార్య తల్లిని నుంచి లోన్ యాప్ ద్వారా రూ.5 లక్షలు తెచ్చుకున్నాడు. అలా కొంత కాలం భర్త రెండు పెళ్లిళ్ల విషయం తెలుసుకున్న రెండో భార్య షాక్ కు గురైంది. ఇక అనంతరం రెండో భార్య ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.