ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ప్రతీ చిన్న కారణాలకు కూడా కన్నవాళ్లను అంతమొందిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కొడుకు తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. ఎందుకో తెలుసా?
భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు సహజం. అయితే అదే కోపాన్ని కొందరు ఇతరులపై చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అడ్డొచ్చిన తల్లిని, తండ్రిని ఇలా ఎవరినీ చూడకుండా దారుణంగా హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపాడు. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కుమారుడు తండ్రిని ఎందుకు హత్య చేశాడు? దీని వెనకాల అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఏపీలోని నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని పడమర పాతకోట గ్రామం. ఇక్కడే పల్లె వెంకటేశ్వర్లు (50), రమణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అయితే పెద్ద కుమారుడైన శ్రీకాంత్ కు 6 ఏళ్ల కిందటే ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అలా సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో తరుచు ఇద్దరు గొడవపడేవారు.
ఇక భర్త పోరు పడలేని భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ తన తండ్రి వెంకటేశ్వర్లుతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన శ్రీనివాస్ తండ్రిపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. కొడుకు దాడిలో తండ్రి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. అనంతరం ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి చనిపోయిన విషయం తెలుసుకున్న కుమారుడు శ్రీనివాస్ స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భార్యపై కోపంతో తండ్రిని హత్య చేసిన ఈ కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.