అనుమానమే ఓ మహిళ నిండు ప్రాణాన్ని తీసేసింది. ఇలాంటి అనుమానమే పెనుభూతంగా మారి అది చినిగి చినిగి చివరికి ప్రాణాల పోయేదాక వస్తుంది. దీని కారణంగా కటుంబంలో అగ్గి రాజుకోవడంతో పాటు భర్తల నుంచి భార్యలు వేధింపులకు గురవుతున్నారు. అచ్చం ఇలాంటి అనుమానంతోనే ఓ భర్త కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నందిగాం మండలం పాలవలస గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన బలగ నాగరత్నం అనే మహిళ 2012లో పూడివలస గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. నాగరత్నం స్థానికంగా ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తుంది. అయితే పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. దీంతో వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది.
ఇది కూడా చదవండి: Nellore: రైల్వే కానిస్టేబుల్ వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య!
అయితే ఈ క్రమంలోనే భర్త రామారావుకి భార్య నాగరత్నం మీద అనుమానం పెరిగింది. ఇదే విషయంపై భార్యను పలుమార్లు వేధింపులకు కూడా గురి చేసేశాడు. ఇంతటితో ఆగకుండా భార్య పుట్టింటికి వెళ్తే అనుమానంతో చూస్తూ ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి చేరుతున్నాయి. ఇక భర్తను లెక్కచేయని భార్య అలా ఎన్నో సార్లు పుట్టింటికి వెళ్లేది. ఇటీవల కూడా భార్య నాగరత్నం ఓ సారి పుట్టింటిికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
అలా వెళ్లటంతో భర్త భార్యపై తీవ్ర కోపంతో ఊగిపోయాడు. ఇక తట్టుకోలేక కోపంతో ఎలాగైన భార్యను చంపాలనే పథకం వేశాడు. ఇక అనుకున్నట్లుగా భార్యను చంపేందుకు ప్లాన్ గీశాడు. మంగళవారం రాత్రి భార్య ఇంట్లో నిద్రిస్తుండగా మెల్లగా ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.