ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఓ వైపు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ పరిధిలో ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా ఈ కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువతి మరణించగా మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే.. ఎయిర్ పోర్టు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరణించిన యువతి టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తనియాగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు శోఖ సంద్రంలో మునిగిపోయారు.
ఇది చదవండి: చచ్చినా సరే డబ్బు కట్టాల్సిందే.! ఇల్లును సీజ్ చేసిన ఫైనాన్స్ సంస్థ!