సాఫీగా సాగిపోతున్న భార్యాభర్తల కాపురాల్లో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి వారి సంసారాలను నాశనం చేస్తున్నాయి. ఇక భర్తను కాదని కొంతమంది భార్యలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. కొంత కాలం ప్రియుడితో కలిసి తిరిగి చివరికి ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో బొక్కబోర్లపడుతున్నారు. ఇక కట్టుకున్న మొగుడిని కాదని ప్రియుడితో చెక్కేసిన భార్య చివరికి కట్టుకున్నోడి చేతిలోనే ప్రాణాలు విడిచింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లాలోని శౌకత్‌పల్లి గ్రామానికి చెందిన మాడవత్ శంకర్, కొండాపురం గ్రామానికి చెందిన రాతుల సరిత ఏడేళ్లుగా ప్రేమించుకొని ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం బాగానే సాగుతూ వచ్చింది. కానీ పెళ్లైన మూడు నెలలకే భార్య సరిత బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది. ఇకపెళ్లై ఆరు నెలలు తిరగకముందే పరాయి వాడి మీద మోజు పడి అతనితో వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Guntur: వివాహేతర సంబంధం.. ప్రియుడి చేతిలో గ్రామ వాలంటీర్ దారుణ హత్య!
దీంతో ఖంగారు పడ్డ తల్లిదండ్రులు మెదక్ జిల్లాలోని శంకరంపేట పోలీస్ స్టేషన్‌లో సరిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో సరితతో పాటు ఆమె ప్రియుడికి కౌన్స్ లింగ్ కూడా ఇప్పించారు. అయినా సరిత బుద్ది మాత్రం మరకుండా మళ్లీ ప్రియుడితోనే వెళ్లిపోయింది. ఇక కొన్నాళ్లకి సరిత భర్తకు ఫోన్ చేసి నేను నీతోనే ఉంటా నన్ను తీసుకెళ్లి అని కబురు పంపింది. ఇక మొత్తానికి సరిత మళ్లీ భర్త వద్దకు చేరింది.
కానీ భర్త మనసులో భార్య నా పరువు తీసిందన్న కోపంతో తన మదిలో మెదులుతూనే ఉంది. కాగా ఈ నెల 13న తనతో పాటు సరితను నల్లగొండకు తీసుకొచ్చిన భర్త శంకర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ రాజుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన శంకర్ భార్య సరిత మెడకు చున్నీతో చుట్టి అదే గదిలో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.