వివాహేతర సంబంధాలే భార్యాభర్తల కాపురాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలోనే హత్యలు లేదా ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్, సారిక భార్యాభర్తలు.
వీరికి 2011లో వివాహం జరిగింది. కొన్నాళ్లకి ఓ కూతురు, కుమారుడు కూడా జన్మించారు. అయితే ఈ దంపతులు 2015లో బతుకుదెరువు కోసమని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక ఎన్‌టీఆర్‌నగర్‌లో ఓ ఇంట్లోకి అద్దెకు దిగి సారిక ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆపరేషన్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా, భర్త మరో చోట పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే భర్త కిరణ్ కు ఈ మధ్యకాలంలో మల్లేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో వీరిద్దరు స్నేహితులుగా కలిసి తిరుగుతున్నారు.
ఇది కూడా చదవండి: Kukatpally: తలుపులు బద్దలు కొట్టి యువతి రూంలోకి దూసుకెళ్లిన హాస్టల్ వార్డెన్.. ప్రిన్సిపల్ వచ్చి చూడగా షాకింగ్ సీన్!
ఈ క్రమంలోనే కిరణ్ ఇంటికి మల్లేష్ అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. మల్లేష్ అలా వస్తున్న క్రమంలోనే సారిక అతనితో పరిచయం పెంచుకుంది. దీంతో ఆ వివాహిత అతనితో చనువుగా దగ్గరైంది. ఇక కొన్నాళ్లకి ఇద్దరి మధ్య బంధం వివాహేతర సంబంధం కొనసాగింది. దీంతో సారిక తాళికట్టిన భర్త కన్నా ప్రియుడే ఎక్కువనుకుంది. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు ఎంచక్కా శారీరకంగా కూడా కలుసుకునేవారు. అలా కొంత కాలం పాటు సారిక భర్తకు తెలియకుండా ఈ చీకటి కాపురాన్ని నడిపించింది.
ఇక సారిక రోజు రోజుకు ప్రియుడు లేకుండా ఉండలేకపోయింది. ఈ విషయం కొన్నాళ్లకి భర్తకు తెలియడంతో మందలించే ప్రయత్నం చేశాడు. ఇక భర్తతో ఉండడం ఇష్టంలేని ఆ వివాహిత ఓ రోజు భర్తకు అతిగా మద్యం తాగించి బండరాయితో తలపై బాది దారుణంగా హత్య చేసి ప్రియుడితో పరారైంది. అనంతరం మృతుడి తమ్ముడు మాచర్ల కిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితులు అర్వపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.