పెళ్లైన నాటి నుంచి ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. పుట్టిన పిల్లలను చదివిస్తూ గ్రామంలోని జనాలు ఈర్శ పడేలా బతుకుతున్నారు. ఇలా ఎంతో ఆనందంగా గడుపుతున్న ఈ దంపతులు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం రోళ్లకల్లు.
ఇదే గ్రామంలో వీరమనేని లక్ష్మణరావు(40), కవిత(35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇద్దరు కుమారుల సంతానం. భర్త 108లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి కాపురాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. అయితే చింతపల్లి మండలం గడియా గౌరారంలో వీరి బంధువుల్లో ఒకరు ఇటీవల మరణించారు. కాగా సోమవారం దశదినకర్మ కావడంతో ఆ కార్యక్రమానికి దంపతులిద్దరూ స్కూటీపై బయలుదేరారు. ఇక తిరుగు ప్రయాణంలో ఈ దంపతులు స్కూటీపై బయలు దేరారు.
ఇంజమూరు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న స్కూటీని బెలెనో కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు, కవిత రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో కవిత అక్కడికక్కడే మరణించగా లక్ష్మణరావును కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లో ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో లక్ష్మణరావు చికిత్స పొందుతూ మరణించాడు. దంపతులు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో వీరి కుమారులు అనాథలయ్యామని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.