కోటలు మేడలు కట్టాలన్నా, కాటికి నలుగురు మోయాలన్నా, గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా, ప్రాణం తీయలన్నా ఒకటే రూపాయి. ఇది ముమ్మాటాకి కరెక్టే. ఇప్పుడు ఇదే రూపాయి ఓ చిన్నారి ప్రాణం తీసింది. తాజాగా నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీ. ఇదే ప్రాంతానికి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది.
కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇక చిన్నకుమార్తె చైత్ర(4) కొన్ని రోజుల కిందట ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయిల కాయిన్ మింగింది. అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే గమనించిన చైత్ర తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు చికిత్స చేసి కాయిన్ తొలగించడంతో అనంతరం ఇంటికి వచ్చారు. అయితే చైత్ర సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన మళ్లీ హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి: YSR District: భర్తను చేసుకున్నందుకు ఏనాడు సుఖం దక్కలేదు.. అలా చేయొద్దంటూ మొత్తుకున్నా వినకుండా!
కానీ మార్గమధ్యలో ఉండగానే చిన్నారి చైత్ర ప్రాణాలు విడిచింది. తమ ముద్దులొలికే చిన్నారి మొన్నటి వరకు మా మధ్య తిరిగి ఇక రాదు, కనపించదు అనే చేదు నిజాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఐదు రూపాయిల కాయిన్ గొంతులో ఇరుక్కుని పోవడంతో ఇన్పెక్షన్ వచ్చిందని, దీని కారణంగానే చిన్నారి చైత్ర మరణించి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.