మనిషి జీవితం నీటి బుడగలాంటిది. తెల్లారితే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. డబ్బు, ఆస్తులు, పలుకుబడి ఇవన్నీ మనిషి చావును కొన్ని రోజుల వరకు పోస్ట్ చేయగలవేమో కానీ చావు నుంచి మాత్రం తప్పించలేవు. ఇలా ఎన్నో ఆశలతో జీవితాన్ని మొదలు పెట్టిన ఓ తల్లీకూతురు ఊహించని ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఇటీవల నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్నిమిగిల్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలసకు చెందిన లక్ష్మి ఆమె కూతురు కల్యాణి నల్గొండలోని టౌన్ లోని పద్మానగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త గతంలోనే మరణించడంతో లక్ష్మీ స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే లక్ష్మి తన కూతురు కల్యాణికి రెండు నెలల క్రితమే పెళ్లి చేసింది. ఇదిలా ఉంటే ఆషాడ మాసం కావడంతో ఇటీవల కూతురు పుట్టింటికి వచ్చింది. దీంతో ఆ రోజు రాత్రి తల్లి కూతురు తిని సంతోషంగా నిద్రిపోయారు. అదే వారికి చివరికి రోజు అవుతుందని మాత్రం వారు ఊహించలేకపోయారు.
అదే రోజు రాత్రి విపరీతంగా వర్షం కురిసింది. ఆ భారీ వర్షాల కారణంగా తల్లీ కూతురు ఉంటున్న ఆ ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో తల్లితో పాటు కూతురు కూడా ప్రాణాలు విడిచింది. ఇటీవల నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆస్తి కోసం తండ్రిని కొడవలితో నరికి చంపిన కొడుకు!