పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శ్రీలత (30). హైదరాబాద్ నల్లకుంటకు చెందిన సాగర్ అనే వ్యక్తిని 9 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో పెళ్లి సమయంలో శ్రీలత తల్లిదండ్రులు సాగర్ కు కట్న కానుకలు భారీగానే ముట్టజెప్పారు. అలా పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఈ దంపతుల సంసారం ఆనందంగా సాగుతూ వచ్చింది. పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. అలా వీరి కాపురం మూడు పువ్వు ఆరు కాయలు అన్నట్లుగా ఆనందంగా సాగుతుంది. ఈ క్రమంలోనే భర్త తాగుడుకు బానిసై భార్యను వేధింపులకు గురి చేసేవాడు.
పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వేధించేవాడు. భర్త వేధింపులకు అత్తమామలు కూడా తోడవ్వడంతో ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ మహిళ తన తల్లిదండ్రులకు వివరించింది. దీంతో పెద్దలతో పంచాయితీ పెట్టించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక నుంచి భర్త మారతాడని శ్రీలతతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. కానీ భర్త ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇక రాను రాను అత్తింటి వేధింపులు ఎక్కువవడంతో శ్రీలత ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలను భర్త తన వద్దే ఉంచుకుని భార్యను పుట్టింటికి పంపించారు.
శ్రీలత పుట్టింటికి వెళ్లినా భర్త అస్సలు వదల్లేదు.. ప్రతీ రోజూ భార్యకు ఫోన్ చేసి నరకం అంటే ఏంటో చూపించాడు. ఇక భర్త వేధింపులు ఎక్కువవడంతో శ్రీలత తట్టుకోలేక పోయింది. ఇలాంటి నరకాన్ని అనుభవించే బదులు చావడం మేలు అనుకుంది. ఇక అనుకున్నట్లుగానే ఆ మహిళ ఇటీవల రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్మకు చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక తెల్లారేసరికి కూతురు శ్రీలత విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఆ మహిళ తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త సాగర్ వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానింకగా తీవ్ర విషాదంగా మారింది.