నేటి కాలంలో కొందరు మహిళలు భర్తను కాదని పరాయి మగాళ్లతో చీకటి కాపురాన్ని నడిపిస్తూ చివరికి అదే కాపురంలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరైతే తాళికట్టిన భర్తతో ఉంటూనే సీక్రెట్ గా మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ సంసారాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలా భర్తను వదిలేసిన ఓ వివాహిత పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా నిసర్గధామాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక మైసూర్ లోని టి. నరసీపుర తాలూకాలోని తలకాడు. ఇదే ప్రాంతానికి చెందిన సుమిత్ర(26) అనే మహిళకు రవిశంకర్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. పెళ్లైన దగ్గర నుంచి వీరిద్దరి వైవాహిక జీవితం బాగానే సాగింది. కానీ కొన్ని రోజులకు భార్యభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో సుమ్రిత తన భర్తను వదిలేసి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మైసూర్‌కు చెందిన సిద్దిరాజు అనే పెళ్లైన వ్యక్తితో సుమిత్రకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇది కూడా చదవండి: అమ్మకు అన్నం పెట్టని కొడుకులు ఉన్న ఈ కాలంలో అమ్మ ప్రేమ దక్కలేదని..
అయితే సిద్దిరాజు కూడా భార్యకు తెలియకుండా ఎంచక్కా సుమిత్రతో ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్నాళ్లకి ఈ విషయం సిద్దిరాజు భార్యకు తెలియడంతో పంచాయితి పెట్టించింది. అయినా తీరు మార్చుకోని భర్త తన ప్రియురాలితో కలిసి తిరిగేవాడు. ఇదిలా ఉంటే ఇటీవల సుమిత్ర, సిద్దిరాజు కలిసి తలకాడు కావేరి నది సమీపంలోని నిసర్గధామా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ మొదటగా సుమిత్ర ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న సిద్దిరాజు తన స్నేహితులకు వాట్సాప్ లో ఓ మెసెజ్ పెట్టాడు. సుమిత్ర చనిపోయింది.. ఆమె లేని జీవితం నాకు వద్దు.. నేను కూడా చనిపోతున్నా అంటూపెట్టి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.