మనసుకి నచ్చిన వాడిని ప్రేమించింది. అతనితోనే నా జీవితం అంటూ ప్రియుడినే పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఎదురించి మరీ కులాంతర వివాహం చేసుకుంది. కోరుకున్నవాడితో సంతోషమైన జీవితాన్ని గడుపుతున్న కూతురిని చూసి తల్లిదండ్రులు సహించలేకపోయారు. కూతురు కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందనే నెపంతో కన్న కూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసిన ఘటన మైసూరులో చోటు చేసుకుంది.
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకలోనిమైసూరు జిల్లా పిరియా పట్టణంలోని కగ్గుండి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన శాలిని (17) స్థానికంగా ఉండే ఓ దళిత యువకుడిని ప్రేమించింది. ఒకరికి ఒకరు నచ్చుకోవడంతో ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనే భావనకు వచ్చారు. ఇందులో భాగంగానే శాలిని ఇటీవల తల్లిదండ్రులు అంగీకరించరనే కారణంతో ఆ దళిత యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది.
ఇది కూడా చదవండి: Jharkhand: బాలికపై లైంగిక దాడి.. నిందితుడిని తగలబెట్టిన స్ధానికులు!
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో నన్ను ఎలాగైన చంపేస్తారని ఆ యువతి ముందే పసిగట్టింది. ఇందులో భాగంగానే నా హత్యకు నా తల్లిదండ్రులు ప్లాన్ గీశారని, నేను చనిపోతే నా మరణానికి నా ప్రియుడు కారణం కాదని, నా తల్లిదండ్రులే కారణమంటూ శాలిని పోలీసులకు ఓ లేఖ కూడా రాసింది. ఇక ఈ క్రమంలోనే తల్లిదండ్రులు శాలినిని దారుణంగా హత్య చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.