దేశంలో రోజు రోజుకు వరకట్న వేధింపుల కేసులు ఎక్కువవుతున్నాయి. పెళ్లి సమయంలో వరుడు కోరినంత కట్నం ఇచ్చినా మరికొంత కొంత కాలానికి అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. భర్తకు అత్తమామలు కూడా సపోర్ట్ చేయడంతో భరించలేని కోడళ్లు మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి కోవలోనే వరకట్న వేధింపులను భరించలేకపోయిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన మైసూరులో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటే పరిధిలోని మచ్చూరు. ఇదే గ్రామానికి చెందిన జ్యోతి (22), ఆనంద్ అనే భార్యాభర్తలు నాలుగు ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదట్లో ఆనంద్ తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. కానీ ఆనంద్ మాత్రం మనసిచ్చిన అమ్మాయినే వివాహమాడాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆనంద్ తల్లిదండ్రులు కట్నం తీసుకురాలేదని కోపంతో జ్యోతిని అదోలా చూసేవారు.
ఇది కూడా చదవండి: రన్‌వేపై ఘోర ప్రమాదం.. ఢీ కొట్టుకున్న రెండు విమానాలు!
భర్తతో జ్యోతి కొంత కాలం పాటు బాగానే సంసారం చేస్తూ వచ్చింది. కానీ రోజులు గడిచే కొద్ది అత్తమామలు వరకట్నం తేవాలంటూ కోడలిని వేధించేవారు. ఈ విషయమై జ్యోతి భర్తకు వివరించింది. భర్త ఈ విషయాన్ని అస్సలు సీరియస్ గా తీసుకోకుండా తల్లిదండ్రులకే మద్దతిచ్చాడు. దీంతో అత్తమామల వేధిపులు ఎక్కువవడం, భార్యకు సపోర్ట్ ఇవ్వకపోవడం వాటిని ఆమె తట్టుకోలేకపోయింది. ఇక ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనస్థానికి గురైంది.
ఇందులో భాగంగానే ఇటీవల ఆ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన జ్యోతి ఆదివారం కన్నుమూసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.