ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన మహిళలు భర్తలను కాదని పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలకు పావులు కదుపుతున్నారు. భర్త కన్న ప్రియుడు ముద్దు అంటూ అతనితో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే పెళ్లీడుకొచ్చిన కూతురు, కొడుకులను ఇంట్లో పెట్టుకుని అక్రమ సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత పెళ్లీడుకొచ్చిన కొడుకు ముందే ప్రియుడితో సరసాలకు తెర తీసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా చోటు వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
కర్ణాటక మైసూరు నంనగూడు పరిధిలోని హుణసనాలు గ్రామం. ఇక్కడే మహాదేవశెట్టి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు కొడుకు మహేంద్ర (27) జన్మించాడు. అలా కొంత కాలం పాటు మహాదేవశెట్టి దంపతుల కాపురం బాగానే సాగుతూ వచ్చింది. అలా సంతోషంగా సాగుతున్న తరుణంలోనే మహాదేవశెట్టి భార్య పక్కచూపులు చూసింది. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన కొడుకును పెట్టుకుని వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేసింది. ఇంతటితో ఆగకుండా స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అలా కొంత కాలం పాటు భర్త మహాదేవశెట్టికి తెలియకుండా ఆ మహిళ తన చీకటి కాపురాన్ని సాగిస్తూ ఉంది.
కానీ ఇటీవల ఆ మహిళ సాగించిన ప్రియుడితో ప్రేమాయణం ఎట్టకేలకు బయటపడింది. భర్తకు ఈ విషయం తెలియడంతో బుద్ది మార్చుకోవాలని చెప్పిచూశాడు. అయినా అవేం పట్టనట్లు ఆ మహిళ ప్రియుడితో మళ్లీ తిరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఆ మహిళ సాగిస్తున్న చీకటి కాపురం కొడుకు మహేంద్రకు కూడా తెలిసింది. ఇక కొడుకు కూడా తల్లికి అనేక సార్లు చెప్పి చూశాడు. అయినా తల్లి ప్రవర్తనలో మార్పు రాకపోగ కుమారుడి ముందే తన ప్రియుడితో సరసాలకు దిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహేంద్ర తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇక ఏం చేయాలో అర్థంకాని మహేంద్ర ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మరణానికి కారణమైన ఈ దుర్మార్గురాలి ప్రవర్తనపై మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.