హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ విషయంలో మిస్టరీ వీడింది. ఆమెను మాజీ భర్త, అతడి కుటుంబ సభ్యులు అత్యంత కిరాకతకంగా హత్య చేశారు. ఆమె శరీరాన్ని ముక్కలు చేశారు. అయితే పోలీసులకు కేవలం ఆమె కాళ్లు మాత్రమే ఓ ప్రిడ్జ్ లో కనిపించాయి. తల, మొండం, కాళ్లు కోసం వెతకగా, చివరకు అవి ఏ పరిస్థితిలో కనిపించాయంటే..?
హాంకాంగ్ మోడల్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అబ్బి చోయ్ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి విదితమే. ఆస్థి వివాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఆమె మాజీ భర్త అలెక్స్ క్వాంగ్, అతడి తల్లిదండ్రులు ఆమెను కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేశారు. అయితే కేవలం కాళ్లు మాత్రమే ఫిడ్జ్ లో పోలీసులకు లభించాయి. తల, మొండం, చేతుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, డ్రోన్లతో పాటు డ్రైనేజీలో కూడా వెతికారు. హత్య తర్వాత పరారైపోదామనుకున్న మాజీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే ఆమె మిగిలిన శరీర భాగాలను ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. విస్తు గొలిపే విషయాలు వెల్లడించారు. ఆమెను హత్య చేసిన ఇంట్లోనే ఓ రెండు సూప్ కుండలు లభించాయని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సూపరింటెండెంట్ అలాన్ చుంగ్ తెలిపారు. ఆ కుండలను పరిశీలించగా.. క్యారెట్, ముల్లంగితో తయారు చేసిన సూప్.. నిండుగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. ఆ ద్రవ్యంలో పైన తేలుతున్న తల కనిపించిందన్నారు. తలపై చర్మంతోపాటు, మాంసం పూర్తిగా ఉడికిపోయి ఉందని, మొత్తం చర్మం అంతా తొలగించబడి చూడటానికి పుర్రెలా తయారయిందన్నారు. సూప్‌లో ఇతర మాంసం ముక్కలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అవి మానవ మాంసం అవశేషాలుగా గుర్తించినట్లు తెలిపారు.
ఫోరెన్సిక్ రిపోర్టులో పుర్రె వెనుక భాగంలో రంద్రం ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. అబ్బిచోయ్ ను నిందితులు కారులో దాడికి పాల్పడి ఆమెకు స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు. గత నెల 21న అబ్బిచోయ్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత తై పో జిల్లాలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలను పోలీసులు కనుగొన్నారు. అదే ఇంట్లో ఎలక్ట్రిక్ రంపం, మాంసం స్లైసర్, దుస్తులు, పొడవాటి రెయిన్ కోట్లు, చేతి తొడుగులు, ముసుగులను, ఆమె ఐడి కార్డులతో సహా ఇతర వస్తువులను పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో చోయ్ మాజీ భర్త, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్ ఉన్నారు. ఇక చోయ్ మాజీ అత్త అయిన జెన్నీ లీ సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించింది. వీరు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు.