Mumbai: లోకల్ ట్రైన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్టు బయటకు తీసి పాడుపనికి తెరతీశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగస్టు 7వ తేదీన ముంబైకి చెందిన ఓ మహిళ భర్త, సోదరుడు, కూతురితో కలిసి దాదర్‌కు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తూ సాయంత్రం 6.32 గంటలకు కల్యాణ్ లోకల్ ట్రైన్ ఎక్కింది. ఆ సమయంలో జనరల్ కంపార్టుమెంట్ మొత్తం జనంతో నిండి ఉంది.
కొద్ది సేపటి తర్వాత మహిళ భర్త, కూతురుకు సీటు దొరికింది. వాళ్లు కూర్చున్నారు. మహిళ, ఆమె సోదరుడు వారి పక్కనే నిలబడి ఉన్నారు. ట్రైన్ కంజుర్‌మార్గ్ చేరుకోగానే ఓ సహ ప్రయాణికుడు ఆమెను పిలిచాడు. మహిళ వెనకాల ఉన్న ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్టును బయటకు తీసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పాడు. దీంతో సదరు మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. నిందితుడి చెంప పగులకొట్టడమే కాకుండా.. భర్త, సోదరుడితో కలిసి అతడ్ని చితక్కొట్టింది. తర్వాత తానే వద్ద అతడ్ని కిందకు దింపారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో అతడు బైకుల్లా ప్రాంతానికి చెందిన అన్సారీగా తేలింది.
కాగా, గతంలో ఇలాంటి సంఘటన ఒకటి ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి మహిళకు వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్ లైవ్‌లో తన ప్రైవేట్ పార్టును మహిళకు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను తనతో గడపాలని కూడా డిమాండ్ చేశాడు. ఫోన్ కట్ చేసిన మహిళ వెంటనే ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరి, లోకల్ ట్రైన్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కోడలిని నరికి తలతో స్టేషన్ లో లొంగిపోయిన అత్త!