దేశంలో అత్యాచార దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గుడి, బడి అనే తేడా లేకుండా కొందరు బరితెగించి ప్రవర్తిస్తూ అడ్డగోలు అత్యాచార దాడులకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు టీచర్లు మాత్రం ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ టీచర్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. గతంలో జరిగిన ఈ ఘటనపై కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది.
అసలు స్టోరీలోకి వెళ్తే.. అది 2019 అక్టోబర్ 19. ముంబైలోని ఖోపర్ కర్నే ప్రాంతంలో 44 ఏళ్ల వ్యక్తి టీచర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతను గత కొంత కాలంగా ఓ మైనర్ విద్యార్థినిపై కన్నేసి ఉంచాడు. సమయం దొరికితే ఏదో చేయాలని అనుకుంటున్నాడు. ఆ సమయం కూడా రానే వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆ బాలికను ట్రాప్ చేసిన ఆ మాస్టారు బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే దారుణాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు షాక్ గురై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇక చాలా ఏళ్ల తర్వాత థానే కోర్టు తాజాగా మైనర్ బాలికపై జరిగిన అత్యాచార దారుణంపై సంచలన తీర్పును వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి రూ. 30 వేల నగదు జరిమానా విధించడంతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడికి శిక్ష పడడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కోర్టు వెలువరించిన ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.