ముంబైలోని ఓ పట్టణానికి చెందిన కామిల్ జమీన్ అన్సారీ అనే యుకుడి ఓ ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరూ గత కొంత కాలంగా సహజీనం చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి మాత్రం ఆ యువకుడు నడి రోడ్డుపై ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.
ముంబైలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ చాలా కాలంగా కలిసి ఉంటున్నారు. ఎవరికి ఎలాంటి కష్టాలు ఉన్నా కలిసి పంచుకునేవారు. అలా ఇద్దరు కొన్నాళ్లు సంతోషంగానే గడిపారు. అయితే ఇటీవల ఆ యువకుడు నడి రోడ్డుపైనే దారుణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని టైమ్ లో ఆమెను అలా చేయడంతో హిజ్రాలు అంతా రోడ్డెక్కి తమ పవర్ ఏంటో చూపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ముంబై థానే జిల్లాలోని లాహోటి ప్రాంతంలో కామిల్ జమీన్ అన్సారీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి నవీబస్తీ ప్రాంతానికి చెందిన తౌహిక్ అనే ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఉంది. ఈ పరిచయంతో ఇద్దరూ చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉంటున్నారు. అంతే కాకుండా సహజీవనం కూడా చేశారు. అలా వీరి ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. వీరిద్దరు గత కొంత కాలంగా డబ్బుల విషయంలో గొడవ పడుతున్నారు. అయితే అదివారం రాత్రి 3 గంటల సమయంలో భీవండి ప్రాంతంలో ఇద్దరూ ఇదే విషయంపై మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన అన్సారీ.. అక్కడే ఉన్న బండరాయితో ట్రాన్స్ జెండర్ తలపై బలంగా బాదాడు. అతని దాడిలో ట్రాన్స్ జెండర్ తౌహిక్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఇక భయంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాన్స్ జెండర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానిక ట్రాన్స్ జెండర్లు అంతా ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.