భార్యాభర్తల మధ్య గొడవలు చినిగి చినిగి చివరికి హత్యల వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త క్షణికావేశంలో భార్య బతికుండగానే తగులబెట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని భివండీ పట్టణంలోని చావింద్ర ప్రాంతం. స్థానికంగా సంతోశ్ చౌరసియా, కవిత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ రోజులు మారే కొద్ది భర్త సంతోష్ ప్రవర్తనలో మార్పొచ్చి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తరుచు వీరిద్దరి మధ్య గొడవల కూడా జరిగాయి. ప్రతీ రోజు మద్యం తాగి రావడం, భార్యతో గొడవలు చేయడం వంటివి చేస్తుండేవాడు.
ఇది కూడా చదవండి: Peddapalli: అన్నం పెడతానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై 44ఏళ్ల వ్యక్తి అత్యాచారం!
దీంతో విసిగిపోయిన భార్య కట్టుకున్న భర్త అంటూ కొన్నాళ్లపాటు నెట్టుకుంటూ వచ్చింది. ఇటీవల కూడా వీరిద్దరి మధ్య చెలరేగిన గొడవల కారణంగా మనస్పర్ధలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా భర్త సంతోష్ అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. వస్తు వస్తూనే భార్యతో గొడవకు దిగాడు. తట్టుకోలేని భార్య భర్తతో సై అంటూ కయ్యానికి దిగింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త సంతోష్ భార్యను దారుణంగా చితకబాదాడు.
దీంతో భార్య అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అయినా భర్త సంతోష్ కోపానికి అడ్డుకట్ట పడలేదు.
ఇంతటితో ఆగకుండా క్షణికావేశంలో అపస్మారకస్థితిలో ఉన్న భార్యను ఇంటిపక్కనున్న కర్రలపైకి తోసేసి అక్కడికక్కడే నిప్పంటించి తగులబెట్టి పరారయ్యాడు. ఇక అందరూ చూస్తుండగానే భార్య చితిలో కాలిపోవడం సంచలనంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.