దేశంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలను వింటుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా? లేక మృగాల మధ్య ఉన్నామా అన్న అనుమానం కలగకమానదు. ఆడది రోడ్డుపై కనిపిస్తే చాలు కొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో వేధించడం, నిరాకరిస్తే అత్యాచారాలు, ఆపై హత్యలు చేస్తున్నారు. ఇక ఇంట్లోనైన రక్షణ ఉంటుందేమనని అనుకుంటే చివరికి ఇంట్లో కూడా రక్షణ కరువవుతుంది. అవును మీరు విన్నది నిజమే. కన్న కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ కిరాతక తండ్రి అత్యాచారం చేసి ఆపై గర్భవతిని చేశాడు. 2 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అప్పట్లో ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఇంతటి దారుణ ఘటన ఎక్కడ జరిగింది? నిందితుడికి న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధించిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని నెట్టుకొచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఏదో కారణంతో ఆ వ్యక్తి తన భార్యతో విడిపోయి పెళ్లైన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు గతంలో ఓ కూతురు జన్మించింది. ఇక ఆ వ్యక్తి కొంత కాలం పాటు రెండవ భార్యతో బాగానే సంసారం చేయడం మొదలు పెట్టాడు. అలా రోజులు గడుస్తున్న కొద్ది అతగాడు తన సవతి కూతురుపై కన్నేసి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.
గత రెండేళ్ల కిందట కూతురిని బెదిరిస్తూ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక నాలుగు నెలల గర్భవతి అయింది. ఈ విషయం చివరికి పోలీసులకు తెలియడంతో ఆ దుర్మార్గపు తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు కోర్టు అనుమతితో గర్భవతిగా ఉన్న ఆ మైనర్ బాలిక నాలుగు నెలల గర్భాన్ని తొలగించారు. అయితే ఈ ఘటనపై బుధవారం న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఈ దారుణ ఘటనపై న్యాయస్థానం తీర్పును విన్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.