అతనికి గతంలో ఓ యవతితో వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత ఓ కుమారుడు జన్మించాడు. పుట్టిన కొడుకుని చూసుకుంటూ ఆ దంపతులు ఆనందంగానే ఉన్నారు. కానీ, ఇటీవల ఆ చిన్నారి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనిస్తానని కుమారుడికి ఆశ చూపి ఏం చేశాడో తెలుసా?
కన్న బిడ్డలకు ఏదైనా గాయం అయితే ఆ తండ్రికే అయినట్టు విలవిలలాడిపోతుంటాడు. ఏది అడిగితే అది కాదనకుండా కొనిస్తూ తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి చేస్తాడు. కానీ, ఓ తండ్రి మాత్రం ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి దారుణానికి తెర తీశాడు. తాజాగా ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. రెండేళ్ల కిందట ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఆ వ్యక్తి స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక్కడే ఆ వ్యక్తికి ఓ యువతితో పరిచయం పెరిగింది. ఆ పరిచయం రాను రాను ఇద్దరి ప్రేమగా మారి చివరికి వివాహేతర సంబంధంగా మారింది. దీంతో సమయం దొరికిప్పుడల్లా ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇకపోతే ఆ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఆ యువతికి కూడా వివరించాడు.
దీనికి ఆమె కూడా సరేనంది. కానీ, ఓ కండిషన్ పెట్టింది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ కుమారుడితో పాటు భార్యను ప్రాణాలతో లేకుండా చేయాలని షరతు విధించింది. దీనికి ఆ వ్యక్తి అస్సలు ఆలోచించకుండా సరేనని ప్రియురాలికి మాటిచ్చాడు. ఇక పక్కా ప్లాన్ తోనే ఆ వ్యక్తి ముందుగా తన కుమారుడిని చంపాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఇటీవల చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి తన కుమారుడిని బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్ల కుమారుడిని గొంతు పిసికి చంపాడు. అనంతరం కుమారుడి శవాన్ని కవర్ లో చుట్టి స్థానికంగా ఉండే ఓ చెరువులో పడేశాడు.
ఇక కుమారుడు కనిపించకపోవడంతో ఆ మహిళ పోలీసుకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంతటా గాలించగా.., ఓ చెరువులో ఆ బాలుడి మృతదేహం కనిపించింది. పోలీసులు అనుమానంతో మృతుడి తండ్రిని విచారించగా అసలు నిజాలు బయటపెట్టాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియురాలిపై మోజుతో కన్న కొడుకుని దారుణంగా హత్య చేసిన ఈ కిరాతక తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.