వాళ్లది రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. తండ్రి డ్రైవర్ గా పని చేస్తుండగా కుమారుడు ఓ షాప్ లో పనికి కుదిరాడు. అక్కడే 6 నెలల పాటు పని చేశాడు. కానీ, ఓనర్ జీతం ఇవ్వలేదు. దీంతో ఆ యువకుడు ఓనర్ ను జీతం ఇవ్వాలని అడగడంతో అతడు దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
పొట్టకూటి కోసం సొంతూరిని దాటి మరో రాష్ట్రానికి వెళ్లాడు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి కావడంతో ఓ చోట పనికి కుదిరాడు. అక్కడే చాలా కాలంగా నమ్మకంగా పని చేశాడు. ఆ ఓనర్ మాత్రం.. ఆ యువకుడిని పని పేరుతో ఊడిగం చేయించుకున్నాడు. అలా 6 నెలలు గడిచింది. అయినా ఆ ఓనర్ ఆ యువకుడికి జీతం ఇచ్చింది లేదు. ఇదే విషయాన్ని ఆ యువకుడు ఓనర్ ను ప్రశ్నించాడు. జీతం అడుగుతావా అంటూ ఆ ఓనర్ పని చేసిన యువకుడిని ఘోరంగా అవమానించి దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అతని పేరు పంకాజ్. వయసు 18 ఏళ్లు. ఉన్న ఊరిలో ఉపాధి కరువవడంతో అతని కుటుంబం చాలా ఏళ్ల కిందటే ముంబైకి వలస వచ్చి దాదార్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి రామ్ రాజ్ జైస్వార్ స్థానికంగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక 10వ తరగతి వరకే చదువుకున్న పంకాజ్.. చదువుకునే వీలు కుదరకపోవడంతో అప్పటి నుంచి అక్కడక్కడ పనులకు వెళ్లేవాడు. అయితే పంకాజ్.. గత 6 నెలల కిందట ఓ కిరాణ షాపులో పనికి కుదిరాడు. అక్కడే చాలా కాలం పాటు ఎంతో నమ్మకంతో కష్టపడి పని చేశాడు. 6 నెలల దాటినా.. ఆ షాపు ఓనర్ మాత్రం పంకాజ్ కు జీతం ఇవ్వలేదు. దీంతో అతడికి పూట గడవడమే కష్టంగా మారింది.
జీతం ఇవ్వలంటూ పంకాజ్.. ఓనర్ ను చాలా సార్లు ప్రశ్నించాడు. ఎంతకూ ఆ ఓనర్ జీతం ఇవ్వలేదు. విసిగిపోయిన ఆ యువకుడు అతని షాపులో పని మానేసి పాత ఓనర్ సోదరుడి దగ్గరే పనికి కుదిరాడు. అక్కడ నెల రోజుల పాటు పని చేశాడు. అతడు కూడా జీతం ఇవ్వలేదు. దీంతో పంకాజ్ తట్టుకోలేక.. ఓనర్ ను డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగాడు. ఇక ఆవేశంతో ఊగిపోయిన ఆ ఇద్దరు ఓనర్లు.. పంకాజ్ పై దారుణానికి పాల్పడ్డారు. అతనికి గుండె చేయించి, నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఈ అవమానాన్ని భరించలేని ఆ యువకుడు నేరుగా ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పంకాజ్ తండ్రి రామ్ రాజ్ జైస్వార్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.