ములుగు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు గత కొన్నేళ్లుగా యువతిని వేధింపులకు గురి చేశాడు. అతడి టార్చర్ ను భరించలేని ఆ యువతి గురువారం అర్థరాత్రి అతనిని కత్తితో పొడిచి చంపింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్న ఓ యువకుడిని యువతి కత్తితో పొడిచి చంపింది. తాజాగా ములుగు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అనంతరం నిందితురాలు అదే రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఎర్రలవాడ గ్రామం. ఇక్కడే శ్రీను (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
గతంలో శ్రీను భార్య అతడిని, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే శ్రీను కొన్నేళ్ల నుంచి స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధించేవాడు. ఇతని వేధింపులను భరించలేని ఆ యువతి గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఇక ఈ కేసులో జైలుకు వెళ్లిన శ్రీను ఇటీవలే విడుదలై బయటకు వచ్చాడు. బుద్ది మార్చుకోని శ్రీను..పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతిని మళ్లీ వేధింపులకు గురి చేశాడు. అయితే గురువారం అర్దరాత్రి కూడా శ్రీను మరోసారి మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లి.. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేశాడు.
అతడి టార్చర్ తో విసిగిపోయిన ఆ యువతి.. శ్రీను చేతులను కట్టేసి ఇంట్లో ఉన్న కత్తితో పొడిచింది. ఈ దాడిలో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక అదే రాత్రి 2 గంటల సమయంలో ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అరెస్ట్ చేశారు. అనంతరం శ్రీను మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా రేపింది. వేధిస్తున్నాడనే కారణంతో యువకుడిని హత్య చేసిన యువతి ఘటనపై మీ అభి ప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.