ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు పూర్తిగా డ్రైవింగ్ లో శిక్షణ తీసుకోనివాళ్లు రోడ్లపై వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఎంపీ భరత్ కారు ఢీ కొని వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
రాజమండ్రి వైసీపీ ఎంపీ భరత్ కు చెందిన కారు ఢీ కొని రిటైర్డ్ పశువైద్యాధికారి మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో శుక్రవారం జరిగింది. దెందులూరు మండలం సీతం పేట పరిధిలో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భీమడోలుకు చెందిన రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ శృంగవృక్షం నరసయ్య (65) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్ల వైపు నుంచి విజయవాడకు వెళ్తున్న కియా కారు అటుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో వెటర్నరీ డాక్టర్ శృంగవృక్షం నరసయ్య స్పాట్ లోనే చనిపోయాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్.ఐ వీర్రాజు తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ మార్గాని భరత్ అందులో లేరని.. కాగా, కారు ఎంపీ భరత్ కుటుంబ సభ్యులకు చెందిన కారుగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. కారుతో పాటు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని ఆయన అన్నారు.
రాజమండ్రి ఎంపీ వైసిపి ఎంపీ భరత్ కారు ఢీకొని వ్యక్తి మృతి
మృతుడు భీమడోలుకు చెందిన రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ శృంగవృక్షం నరసయ్యగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగినప్పుడు ఎంపీ భరత్ కారులోనే ఉన్నట్లు తెలుస్తుంది. pic.twitter.com/eH29Eko5OH
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2023