kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జీలో తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఏడుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్, వీడియోలో తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల మేరకు.. కామారెడ్డిలోని రామాయం పేటకు చెందిన సంతోష్, అతడి తల్లి పద్మ గత 11వ తేదీన న్యూ మహారాజ లాడ్జీలో ఓ రూం తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున వారి గదినుంచి పొగలు రావటంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు సంతోష్, పద్మ పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించారు. మృతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ సూసైడ్ నోట్, వీడియోను స్వాధీనం చేసుకున్నారు.
సదరు సూసైడ్ నోట్, వీడియోలో తమ చావుకు ఏడుగురు వ్యక్తులు కారణమని వారు ఆరోపించారు. రామాయం పేట మున్సిపల్ ఛైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులు కారణమని పేర్కొన్నారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని రామయం పేట మున్సిపల్ ఛైర్మన్ బెదిరించాడని మృతుడు తెలిపాడు. ఫేస్‌బుక్ పోస్టు పెట్టాడని గతంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించారని వెల్లడించాడు. మున్సిపల్ ఛైర్మన్‌తో కలిసి అప్పటి రామాయం పేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నాగార్జున గౌడ్ ప్రస్తుతం తుంగతుర్తి సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి : విషాదం: కబడ్డీ ఆడుతూ SI మృతి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.