యాదాద్రి భువనగిరి జిల్లాలోని గొల్నేపల్లికి చెందిన మహిళ ఆన్‌లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. దీంతో ఇంట్లో భర్తతో గొడవలు అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి రావడంతో భర్త ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లక్షల డబ్బులు లాస్ అయిన తర్వాత కూడా ఎందరో తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈజీ మనీ అనేదానికి ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వారిని టార్గెట్ చేసుకుని కొన్ని ఆన్‌లైన్ గేమ్స్ వస్తున్నాయి. ఆన్‌లైన్ గేమ్‌కి బానిసగా అయి డబ్బులు పోగొట్టుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని గొల్నేపల్లికి చెందిన మహిళ ఆన్‌లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. దీంతో ఇంట్లో భర్తతో గొడవలు అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి రావడంతో భర్త ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్, రాజేశ్వరి అనే దంపతులు ఉన్నారు. వారికి అనిరుధ్(5), హర్షవర్ధన్(3) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కొన్ని సంవత్సరాలుగా చౌటుప్పల్‌లో నివాసముంటున్నారు. మల్లేశ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రాజేశ్వరి ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతూ ఉంది. ఈ క్రమంలో రూ. 8 లక్షలు పోగొట్టుకుంది. తను పోగొట్టుకున్న డబ్బంతా తనకు తెలిసిన బంధువుల దగ్గర అప్పుగా తీసుకుంది. బాకీ ఇచ్చిన వారిలో ఒకరు వీరి దగ్గరి బంధువు తన అప్పు తీర్చమని వచ్చారు. చాలాసేపు ఇంటివద్ద కూర్చుని మాట్లాడారు. దీంతో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరిగాయి. తర్వాత భర్త ఇంట్లోనుండి వెళ్లిపోయాడు. డబ్బులు ఇచ్చిన అతను కూడా వెళ్లిపోయిన తర్వాత రాజేశ్వరి అవమానానికి గురై చాలా కుమిలిపోయింది. వారి ఇంటి ఆవరణంలో ఉన్న నీటి సంపులో తన ఇద్దరు కొడుకులను తోసేసింది. తర్వాత తాను కూడా సంపులోపడి ప్రాణాలు తీసుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో మల్లేశ్ ఇంటికి వచ్చి భార్యాపిల్లలను వెతుకుతుండగా.. సంపు మూత తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి అందులో చూశాడు. తల్లీ ఇద్దరు కొడుకులు సంపులో పడి చనిపోయారు. వెంటనే వారిని బయటకు తీసి చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అలా బతుకులను ఆడిస్తున్నాయి ఆన్‌లైన్ గేమ్స్.