మధ్యకాలంలో కేటుగాళ్లు ఎక్కువయ్యారు. దొంగతనాలు చేయడానికి కొత్త కొత్త పధకాలు రచిస్తున్నారు. దొంగతనాలు చేయాడానికి కొత్త రకం జాబ్స్ ను క్రియోట్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఆ జాబ్ ఏమిటంటే..పార్కింగ్ ఏరియా నుంచి తీసినంత ఈజీగా బైక్‌ను తీయాలి. ఆ తర్వాత ఎవ్వరికి డౌట్ రాకుండా కొట్టేయాలి. ఆ తర్వాత ఆ బైక్‌ను జాబ్ ఇచ్చిన యాజమాన్యానికి అప్పగించాలి. అలా చేసినందుకు వేలలో జీతం ఇస్తారు. నిరుద్యోగ యువకులను ఉపయోగించుకుని ఈ దందా నిర్వహిస్తున్నారు. అయితే ఇదంతా ఎక్కడ అనేగా మీ సందేహం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దొంగతనం కూడా ఓ వృత్తే అన్నట్లుగా రాజస్థాన్‌లో ఓ ఇర్భాన్ అనే వ్యక్తి దొంగలను రిక్రూట్ చేసుకుంటున్నాడు. దొంగతనాల కోసం ఏకంగా ఓ కంపెనీ పెట్టాడు.. వాటిలో దొంగల టాలెంట్, పనిని బట్టి వారిని నియమించుకుంటున్నాడు. అయితే వారికి దొంగతనానికి ఇంత అని కాకుండా.. దోచేయడంలో చూపించే ట్యాలెంట్ బట్టి ప్రతి నెల జీతాలు కూడా ఫిక్స్ చేశాడు. పైగా బాగా పని చేస్తే బోనస్‌లు కూడా ఇచ్చాడు. బైక్‌లు, ఎలక్ట్రిక్ రిక్షాలు మాయం చేయాలి. ఆ తర్వాత వెహికిల్‌ను తక్కుకింద మార్చాడం ఎంపికైన దొంగల విధి. ఇందుకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు ఈ దొంగల యజమాని. వారి పని ఆధారంగా 10 వేల నుంచి 30 వేల వరకు జీతాలు ఇస్తున్నాడు.
ఇర్ఫాన్ చేసే దొంగతనాల గురించి తెలుసుకున్న జైపూర్ పోలీసులు తల పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ పాటు పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 90 బైక్ ఇంజిన్లు, వందలకొద్దీ బ్యాటరీలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు ఇప్పటిదాకా కోట్ల విలువ చేసే వాహనాలను చోరీ చేసి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జాబ్ లేక రోడ్లపై తిరుగుతున్న వారి బలహీనతను క్యాష్ చేసుకుని ఇలా చేస్తున్నారు ఈ దొంగలు అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.