ఎవ్వరూ లేని సమయంలో ఇంటికి కన్నం వేసి నగలు, డబ్బు, విలువైన వస్తువులు దోచుకెళ్లిన వాళ్లను చూశాం. షాపుల్లోకి వెళ్లి.. సక్కంగా సర్థిన ఘరానా మోసగాళ్ల గురించి విన్నాం. అయితే వీరిలో బీహార్ దొంగల తీరే వేరు. మనిషి తెలియకుండా లో దుస్తులు కూడా కొట్టేయగల సమర్థులు.
అరవై నాలుగు కళల్లో చోర కళ ఒకటి. అయితే ఇదే కళను ఉపయోగించి కనపడినకాడికి దోచుకెళుతున్నారు దొంగలు. కోళ్లను దొంగతనం చూసేవాళ్లను చూశాం, లేదంటే ఎవ్వరూ లేని సమయంలో ఇంటికి కన్నం వేసి నగలు, డబ్బు, విలువైన వస్తువులు దోచుకెళ్లిన వాళ్లను చూశాం. షాపుల్లోకి వెళ్లి.. సక్కంగా సర్థిన ఘరానా మోసగాళ్ల గురించి విన్నాం. అయితే వీరిలో బీహార్ దొంగల తీరే వేరు. మనిషి తెలియకుండా లో దుస్తులు కూడా కొట్టేయగల సమర్థులు. చిన్న వస్తువులే అనుకుంటే పొరపాటు. దర్జాగా రైలు పట్టాలు, బోగీలు, అవసరమైతే వంతెన కూడా కొట్టేస్తారు. మొన్నటికి మొన్న సెల్ టవర్ అందరూ చూస్తుండగానే చోరీ చేశారు. పోలీసులు, అధికారులు సైతం ఖంగుతిన్నారు. అయినా వారేం చేస్తారో అనుకున్నారేమో.. మళ్లీ వారి దందా షురూ చేశారు. మరో సెల్ టవర్ ఎత్తుకుపోయారు.
బీహార్‌లోని ముజఫర్‌పుర్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. మరో మొబైల్ టవర్‌ను చోరీ చేశారు. 10 రోజుల్లో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండో సారి. సికందర్పుర్లోని న్యూ కాలనీ బాలుఘాట్లో ఆదివారం జరిగిందీ ఘటన. అక్కడ జీటీఎఎల్ కంపెనీకి చెందిన మొబైల్ టవర్ ఉంది. దీనిని పరిశీలించేందుకు ఆ సంస్థ ఉద్యోగులు రాగా, అక్కడ టవర్ కనిపించలేదు. ఈ క్రమంలో టవర్ చోరీకి గురైనట్లు వారు గుర్తించారు. వెంటనే సికందర్పుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు..అయితే ఇది కొన్ని నెలల క్రితమే చోరీకీ గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంటే ఇక్కడ దొంగతనం జరిగినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే.. ఇటీవల జరిగిన దొంగతనానాకి స్కెచ్ వేసినట్లు అర్థమౌతోంది.
10 రోజుల క్రితమే ఇదే ముజఫర్‌పుర్‌లో సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ టవర్‌ను చోరీ చేశారు దొంగలు. శ్రమజీవి నగర్లో పట్టపగలు దొంగలు మొబైల్ టవర్ ను సక్కంగా విడివిడి భాగాలు చేసి వెంట తెచ్చుకున్న వాహనంలో దర్జాగా తీసుకెళ్లారు. సంస్థ ప్రతినిధులమంటూ చట్టుపక్కల వారిని నమ్మించి చోరీకి పాల్పడ్డారు. అదీ కూడా జీటీఎఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు చెందిన మొబైల్ టవర్ కావడం గమనార్హం. మనీషా కుమారి అనే మహిళ ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ టవర్ మరమ్మత్తులు నిమిత్తం అధికారులు రాగా, టవర్ లేకపోవడం చూసి.. చుట్టూ ప్రక్కల వారిని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. .