తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. పార్టీలో నన్ను ఎవరూ కూడా మాట్లాడనివ్వటం లేదని, అస్సలు నాకు గౌరవం ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగ్గారెడ్డి సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.
నాకు కనీసం నాకు గౌరవం ఇవ్వకుండా చేస్తున్నారని, నేటి రాజకీయాల్లో హీరోయిజం పని చేయదని అన్నారు. ఇక నేను పార్టీ మారాలనుకుంటే అది ఎంత సేపని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాకు కూడా చాలా మంది అభిమానులున్నారని, పార్టీ అండదండలు లేకుండా రెండు లక్షల మందితో సభ పెట్టే సత్తా ఉందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక జహీరాబాద్ లోని నిర్వహించబోయే క్రికెట్ మ్యాచ్ గురించి నాకు కానీ గీతా రెడ్డికి చెప్పకపోవటమేంటని ఆయన ప్రశ్నించారు. ఇక వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాట పడితే పార్టీలో కుదరదంటూ జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.