Missing Case : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురు ఆడవాళ్లు కనిపించకుండా పోయారు.
1) ఆనందపురం యాతపేటకు చెందిన కుప్ప లావణ్య 18వ తేదీన టైలరు దగ్గరకు అని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు.
2) లోడగలవానిపాలెం గ్రామానికి చెందిన మరడాన లావణ్య ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. 18వ తేదీన స్కూటీపై కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. ఈ రెండు మిస్సింగ్‌లపై కేసులు నమోదయ్యాయి.
తాజాగా, మరో రెండు మిస్సంగ్ కేసులు నమోదయ్యాయి.
3) హైదరాబాద్, బంజారాహిల్స్‌కు చెందిన హస్నియా బేగం 17వ తేదీన కాలేజీకని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. అన్నీ చోట్ల వెతికిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి ఘటనే మరోటి చిత్తూరు జిల్లాలో జరిగింది.
4) చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలుకు చెందిన మౌనిక 19వ తేదీన కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు.
ఓ మూడు కేసుల్లో ఒకటి కామన్‌గా ఉంది. లావణ్య, హస్నియా, మౌనికలు కళాశాలకు వెళ్లి కనిపించకుండా పోయారు. ఈ ముగ్గురు కనిపించకుండా పోవటానికి ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా?.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఒక వేళ కిడ్నాప్ చేస్తే ఎందుకు?.. ఈ రెండు కాకపోతే ఈ ముగ్గురు ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఎక్కడికైనా పారిపోయారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరుస మిస్సింగులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నటిపై యాసిడ్ దాడి.. నిద్రిస్తుండగా ఇంట్లోకి వచ్చి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.