ఈవెంట్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 12 దాటినా కూతురు తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువతికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యువతి ఈవెంట్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 10 గంటలు అయింది. కానీ, కూతురు తిరిగి ఇంటికి చేరుకోలేదు. అయినా మరో గంట వేచి చూశారు. ఎంతకు కూడా ఆ యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ యువతికి ఫోన్ చేశారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతా ఖంగారుపడ్డారు. చివరికి ఆ యువతి తిరిగి ఇంటికి వచ్చిందా? ఇంతకు అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్టలోని శ్రీనగర్ లో అంజని కుమారి అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. స్థానికంగా ఈ యువతి డిగ్రి మొదటి సంవత్సరం చదువుతుంది. ఇదిలా ఉంటే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంజని కుమారి.. ఈవెంట్ ఉంది, మేకప్ వేసి వస్తానని ఆదివారం ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 10 గంటలు దాటింది. కానీ, కూతురు మాత్రం తిరిగి ఇంటికి చేరుకోలేదు. అయినా ఆ యువతి తల్లిదండ్రులు మరో గంట వేచి చూశారు.
ఎంతకు కూడా ఆ యువతికి ఇంటికి రాలేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు కూతురికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఇక ఖంగారుపడ్డ తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో గాలించారు. అయినా అంజని కుమారి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక ఆ యువతి తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి కూతురు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.