ఇటీవల దేశంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరగడం.. పలువురు ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అతి వేగం ప్రమాదం అని.. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని అత్వెల్లి వద్ద నేషనల్ హైవేపై మంగళవాకరం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అత్వెల్లి వద్ద నేషనల్ హైవే పై ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. కొంపల్లి నుంచి తుప్రాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులోనే ప్రతాప్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి కారును పోలీసులు తరలించారు. ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గజ్వేల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి సీఎం కేసీఆర్ పై రెండు పర్యాయాలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు.వంటేరు ప్రతాప్ రెడ్డి కి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.