మెదక్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దంపతుల హత్య తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంట్లో ఉన్న దంపతులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కుల్చారం మండలం పైతర. ఇదే గ్రామానికి చెందిన నిమ్మనగారి లక్ష్మారెడ్డి(55), లక్ష్మి(50) దంపతులు నివాసం ఉంటున్నారు.
అయితే మంగళవారం రాత్రి ఈ దంపతులు ఇద్దరు ఉంట్లో ఉన్నారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మొదటగా ఇంట్లోకి కరెంట్ రాకుండా చేశారు. అనంతరం లక్ష్మి తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భర్తను ఇంటి సమీపంలోని పశువుల కొట్టంలో దారుణంగా పొడిచి హత్య చేశారు. తర్వాత ఆ దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. దంపతుల హత్యను తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు దంపతుల హత్యకు కారణం ఏంటి? ఏమైన ఆస్తిగొడవలు ఉన్నాయా? లేదంటే మరేదైన బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ హత్యా కాండ స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దంపతుల హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.