ఆమె పేరు ఉష.. వయసు 23 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం గ్రామానికి చెందిన ఈ అమ్మాయి మెదక్ టౌన్‌కి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రాను రాను వీరిద్దరి మధ్య బంధం బలంగా మారింది. వీరి మనసులు కలవడంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నారు. ఇక ఒకరిని విడిచి మరోకరు ఉండలేమన్నట్లుగా తయారై చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
అయితే ఇద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదోన్న భయం వారిని వెంటాడుతోంది. ఇక ఇదే విషయాన్ని భయంతో వారిద్దరి తల్లిదండ్రుల ముందుకు తీసుకెళ్లారు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి వారిరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఇద్దరు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక పట్టుబట్టి మరీ చివరికి వారిని ఒప్పించారు. ఇక పెద్దల ఇష్టం మేరకు ఇదే నెల 11వ తేదిన హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో వీరి వివాహాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Father: ఆ మాట అన్నందుకు నవవధువును హత్య చేసిన తండ్రి!పెళ్లై దాదాపుగా 15 రోజులు కావస్తోంది. కొత్త కోడలొచ్చిందని అత్తింటివాళ్లు కూడా ఎంతో సంబరపడ్డారు. ఈ నేపథ్యంలోనే నవ వధువు ఉషకు తలలో నొప్పిగా ఉంటే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉషకు అన్ని వైద్య పరీక్షలు చూసిన వైద్యులు ఊహించలేని వార్తను వారి మందు ఉంచారు. ఉషకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆమె బతకడం చాలా కష్టం అంటూ చెప్పారు. ఈ విషయాన్ని విన్న ఉష భర్త రాఘవేంద్రకు గుండె పగిలినంత పనైంది. ఆ క్షణంలో అతనికి ఏం జరుగుతుందో ఏమో అస్సలు అర్థంకాని పరిస్థితి. పక్కనే ఉన్న ఉష తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇక డాక్టర్లు చెప్పినట్లే చివరికి ఉష ప్రాణాలు విడిచింది. కాళ్ల పారాణి అరకముందే ఉష చనిపోవడంతో భర్త రాఘవేంద్ర గుండెను బాదుకుంటూ కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నా.. కనీసం కోరుకున్న వ్యక్తితో నెల రోజులు కూడా ఉండకుండా పోయింది. ఇక భర్తను ఒక్కడిని చేసి అందని లోకాలకు వెళ్లిపోయిందంటూ ఉష తల్లిదండ్రులు పుట్టెడు శోకంతో కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లైన 18 రోజులకే ఉష మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.