మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్థం రోజే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని టెక్మల్ కు చెందిన గుంజి బాలరాజ్ అనే యువకుడు అదే మండలంలో సోలార్ ప్లాంట్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలోనే ఆ యువకుడికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూసి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాగా విధి నిర్వహణలో భాగంగా బాల్ రాజ్ ఆదివారం అర్ధరాత్రి వరకు అక్కడే పని చేస్తూ ఉన్నాడు.
ఇది కూడా చదవండి: దారుణం: 5 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం!
ఇక తెల్లారేసరికి దానంపల్లి శివారులోని ఓ విద్యుత్ స్తంభానికి బాల్ రాజ్ ఉరేసుకుని కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమెదు చేసుకుని విచారిస్తున్నారు. అయితే గతంలో తన విధులు నిర్వర్తిస్తున్న ప్లాంట్ లోనే పై అధికారులతో బాల్ రాజ్ కు గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే బాల్ రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక శత్రువులెవరైన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.