ఓ యువకుడు ఉన్నట్టుండి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లిందన్న కారణంతో మనస్థాపంతో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. నవాబ్ పేటలో షేక్ జహంగీర్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు మూడు నెలల కిందట మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే రాను రాను భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు భగ్గుమన్నాయి. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకునేవారు. అయితే ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు.
భర్తతో గొడవలతో భరించలేకపోయిన ఆ మహిళ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్య తిరిగి వస్తుందని జహంగీర్ భావించాడు. కానీ, చాలా రోజులు అయినా భార్య తిరిగి రాకపోవడంతో జహంగీర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక చేసేదేం లేక ఆ యువకుడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతని కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. జహంగీర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసిన అతని తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య చేసుకున్న భర్త ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.