దేశంలో ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు రోజు రోజుకీ రెచ్చిపోతూనే ఉన్నారు. ఓ మహిళ ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు ప్రజాసేవ కేంద్రానికి వెళ్లింది.. ఒంటరిగా వచ్చిన ఆ మహిళపై అక్కడున్న సిబ్బంది కన్నేశారు. నలుగురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత యువతిని బెదిరించడం మొదలు పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధురకు చెందిన ఓ మహిళ అంగన్‌వాడీలో జాబ్స్ పడ్డాయని తెలుసుకుంది. ఈ క్రమంలో వర్కర్ పోస్ట్ అప్లై చేయడానికి ఫారం కొనేందుకు ప్రజాసేవ కేంద్రానికి వెళ్లింది. ఆ మహిళ చూసిన వారు ఆమెపై కన్ను వేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో మాటా మాటా కలిపి లోపలికి తీసుకు వెళ్లి ముగ్గురు లైంగిక దాడికి తెగబడ్డారు.
ఈ దారుణాన్ని మరో వ్యక్తి తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఆ వీడియో యువతి అత్తమామలకు, బంధువులకు పంపడంతో విషయం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. ఉద్యోగం కోసం వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఆ నింధితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కంట తడి పెట్టిస్తున్న NRI మహిళ చివరి సెల్ఫీ వీడియో!