మరి కొద్దిసేపట్లో పెళ్లి. మండపానికి వరువు, వధువు ఇద్దరూ వచ్చారు. మండపం అంత సందడిగా మారిపోయింది. ఈ క్రమంలోనే వరుడు వధువుతో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఈ దెబ్బతో ఇతడిని పెళ్లి చేసుకోనంటూ వధవు కరాఖండిగా చెప్పింది. వరుడు ప్రదర్శించిన అత్యుత్సాహం ఏంటంటే?
ఓ యువతి, యువకుడికి పెళ్లి చేయాలని ఇరువురి పెద్దలు నిర్ణయించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. మండపానికి బంధువులతో పాటు వరుడు, వధువు కూడా వచ్చారు. భాజాభజంత్రీలతో పెళ్లి మండపం అంతా సందడిగా మారింది. ఒకపక్క వధువు, వరుడి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా మురిసిపోతున్నారు. ఇక మరి కొద్ది క్షణాల్లో పెళ్లి అనగా వరుడు కాబోయే భార్యతో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. వరుడి ప్రవర్తన నచ్చని ఆ పెళ్లి కూతురు అతనితో పెళ్లికి నో చెప్పింది. ఈ దెబ్బతో పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లా మాణిక్ పూర్ ప్రాంతానికి చెందిన యువతికి మరో ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి చేయాలని ఇరువురి పెద్దలు నిర్ణయించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. త్వరలో పెళ్లి అనగా పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. మరి కొద్ది సేపట్లో పెళ్లి, భాజాభజంత్రీలతో పెళ్లి మండపం అంతా సందడిగా మారిపోయింది. ఈ క్రమంలోనే వరుడు ఫుల్ గా తాగి మండపానికి వచ్చాడు. అంతటితో సరిపెట్టకుండా అందరూ చూస్తుండగానే కాబోయే భార్యపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సిందూరం చల్లాడు. మొదట్లో ఆ వధువు పోనిలే అనుకుంది. కానీ, అదే పనిగా అతడు సిందూరం చల్లడం మొదలు పెట్టాడు.
అంతేకాకుండా మద్యం మత్తులో వధువుకి బొట్టు కూడా పెట్టలేని స్థితిలో ఉండిపోయాడు. ఇతని ప్రవర్తన వధువుకి అస్సలు నచ్చలేదు. అందరూ చూస్తుండగానే ఇతనిని పెళ్లి చేసుకోను అంటూ ఆ వధువు కరాఖండిగా చెప్పింది. ఆమె మాటలతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ దెబ్బతో పెళ్లి ఆగిపోయింది. దీంతో ఇరువురి బంధువులు కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించగా పెళ్లిలో భాగంగా ఇచ్చిన కట్న కానుకలు తిరిగి ఇచ్చేందుకు వరుడు కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి మండపంలో వరుడి అత్యుత్సాహంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.